హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆవిష్కరణలకు టీవర్క్స్ కేంద్రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన టీవర్క్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
దీంట్లోభాగంగా వెదురు కట్టె (బ్యాంబూ)తో విభిన్న కళాకృతులను తయారుచేసే బ్యాంబూ ఆర్టిస్టు పవన్‌తో సోమవారం టీవర్క్స్‌లో వర్క్‌షాప్ ఏర్పాటుచేశారు. వివిధ కళల్లో నైపుణ్యం ఉన్నవారితో ఔత్సాహికులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని నిర్వాహకులు తెలిపారు.