CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
CM Vijay : తమ రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. ఆంధ్రప్రదేవ్ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. కానీ, తెలంగాణ సీంఎ రేవంత్ రెడ్డిలో కాసింత కూడా చలనం లేదు.
CM Vijay : తమ రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. పనిలో పనిగా గోదావరి – కావేరి నదుల అనుసంధానంపై చర్చ జరిపారు. కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)లో కాసింత కూడా చలనం లేదు. ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న రేవంత్‌కు రైతులకు సాగు నీటిపై కాసింత కనికరం లేకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అంతేకాదు తాగునీటి కోసం తమిళ సీఎం, పార్టీ పెద్దల మెప్పు కోసం రేవంత్ అని కామెంట్ చేస్తున్నారు.
తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల మీద ఎత్తిపోతల పంపులు ఆన్ చేయకుండా, కనీసం బోరు బావులకు కరెంటు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి రైతుల పొలాలు ఎండబెడుతున్నారు. దాంతో, తమిళనాడు సీఎం విజయ్ను చూసి అయినా నేర్చుకోండని, రైతుల కోసం ఏపీతో సాగునీటికోసం పోరాడాలని పలువురు రేవంత్‌కు సూచిస్తున్నారు. తెలంగాణలో జూరాల కింద ఎండుతున్న పంటల కోసం కర్ణాటకకు మంత్రుల బృందాన్ని పంపి రేవంత్ రెడ్డి చేతులు దులిపేసుకున్నారు. సాగునీళ్లు వదులుతామని కర్ణాటక హామీ ఇచ్చిందని మంత్రుల బృందం ప్రకటన చేసింది. కానీ, ఇప్పటివరకు కాంగ్రెస ఏలుబడిలోని కర్ణాటక చుక్కనీరు వదలకున్నా సీఎం రేవంత్ నోరు తెరిచి అడగడం లేదు.
ఏపీ నుంచి రావాల్సిన సాగునీటిపై దృష్టి సారించకుండా.. కృష్ణా, గోదావరి నదుల మీదిఎత్తిపోతల పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు రెండో పంట అసలు వేయొద్దని సూచిస్తున్నారు. అంతేకాదు నిత్యం మంత్రులతో పంటలు వేయొద్దని రైతులను హెచ్చరిస్తున్నారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్షాలు సాగునీటి విడుదలకు పట్టుపడుతుండగా.. రైతుల సమస్యలు గాలికి వదిలి, క్యాబినెట్ సమావేశం వాయిదా వేసి మరీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బాట పట్టారు.
తెలంగాణను ఎడారి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే కేంద్రం మీద ఒత్తిడి చేసి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెనక్కి పంపేలా చేశారు బాబు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేలేంత వరకు డీపీఆర్ పరిశీలించం అని కేంద్ర జల వనరుల శాఖ ప్రకటన చేయగా.. ఈ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నోరు తెరవడం లేదు. ఏడాది కాలంగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని తమ అనుకూల మీడియాలో లీకులతో వార్తలు కుమ్మరిస్తున్న ప్రభుత్వం ఉన్న వనరులను ఉపయోగించడం లేదు. కాళేశ్వరంను ఎండబెట్టి ఉత్తర తెలంగాణలో, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పడావుపెట్టిందీ దగాకోరు సర్కార్. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులు నడపకుండా దక్షిణ తెలంగాణలో రైతుల పొలాలు ఎండబెట్టిన ఘనుడు రేవంత్ అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
చెన్నైకి తాగునీటి కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తమిళనాడు సీఎం విజయ్
పనిలో పనిగా గోదావరి – కావేరి నదుల అనుసంధానంపై చర్చ
తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల మీద ఎత్తిపోతల పంపులు ఆన్ చేయకుండా, కనీసం బోరు బావులకు కరెంటు ఇవ్వకుండా తెలంగాణ రైతుల పొలాలు ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో జూరాల కింద ఎండుతున్న పంటల కోసం కర్ణాటకకు మంత్రుల బృందాన్ని పంపి చేతులు దులుపుకున్న రేవంత్ రెడ్డి
సాగునీళ్లు వదులుతామని కర్ణాటక హామీ ఇచ్చిందని ప్రకటన చేసిన మంత్రుల బృందం
ఇప్పటి వరకు చుక్కనీరు వదలని కర్ణాటక.. అయినా నోరు తెరిచి అడగని రేవంత్ రెడ్డి
రైతులు రెండో పంట అసలు వేయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేసి, నిత్యం మంత్రులతో పంటలు వేయొద్దని రైతులను హెచ్చరిస్తున్న రేవంత్ రెడ్డి
రైతుల సమస్యలు గాలికి వదిలి, క్యాబినెట్ సమావేశం వాయిదా వేసి ఢిల్లీ బాట పట్టిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
తెలంగాణను ఎడారి చేసేందుకు కత్తులు నూరుతున్న చంద్రబాబు
ఇప్పటికే కేంద్రం మీద ఒత్తిడి చేసి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెనక్కి పంపిన వైనం. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేలే వరకు డీపీఆర్ పరిశీలించం అని కేంద్ర జలవనరుల శాఖ ప్రకటన
ఈ అంశంపై ఇప్పటి వరకు నోరు తెరవని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
గత ఏడాది కాలంగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని అనుకూల మీడియాలో లీకులతో వార్తలు కుమ్మరిస్తున్న ప్రభుత్వం
కాళేశ్వరం ఎండబెట్టి ఉత్తర తెలంగాణలో, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పడావుపెట్టి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులు నడపకుండా దక్షిణ తెలంగాణలో రైతుల పొలాలు ఎండబెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
తెలంగాణ రైతుల సమస్యలను గాలికి వదిలి గోవా, ఢిల్లీల్లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

