భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో.. 19 గేట్లు ఎత్తి దిగువకు 36,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 34,900 క్యూసెక్కులుగా ఉంది.