Congress | మంత్రి పదవి తీస్కోండి.. పీసీసీ చీఫ్ ఇవ్వండి.. అధిష్ఠానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి ప్రతిపాదన!
టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆసక్తి చూపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే, మంత్రి పదవిని సైతం వదులుకునేందుకు ఆయన సిద్ధమైనట్టు తెలిసింది.
- 2029 ఎన్నికల్లో కీలకపాత్ర పోషించేందుకు వ్యూహం
Congress | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆసక్తి చూపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే, మంత్రి పదవిని సైతం వదులుకునేందుకు ఆయన సిద్ధమైనట్టు తెలిసింది.
ఈ మేరకు అధిష్ఠానానికి సంకేతాలు కూడా పంపినట్టు సమాచారం. పీసీసీ బాస్‌ను కావాలన్న పట్టుదలతో ఉన్న ఆ మంత్రి, ఇప్పటికే ఢిల్లీలో తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది. పీసీసీ అధ్యక్ష పదవిని ఈసారి బీసీ నేతకు ఇస్తారనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతున్నది.
ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎం పదవి ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చిన నేపథ్యంలో పార్టీ పగ్గాలను బీసీలకు ఇవ్వాలంటూ బీసీ నేతలు గట్టిగానే వాదిస్తున్నారు. అధిష్ఠానం కూడా ఇదే ధోరణిలో ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ బీసీ మంత్రి పీసీసీ పీఠం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
మంత్రి పదవి కన్నా పీసీసీ పీఠమే ఎక్కువ
ఎమ్మెల్యేగా గెలిచిన ఏ నాయకుడైనా సహజంగా మంత్రి పదవిని కోరుకుంటారు. ఇందుకు విరుద్ధంగా ఆ బీసీ నేత తనకు మంత్రి పదవి దక్కినప్పటికీ, పీసీసీ పీఠానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. మంత్రి పదవి అయితే ఒక శాఖ, మహా అయితే ఒక జిల్లా అధీనంలో ఉంటుంది.
పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే, పార్టీ మొత్తం తన అధీనంలో ఉండే అవకాశం ఉంటుంది. సదరు మంత్రి పీసీసీ పీఠం కోసం ప్రయత్నం చేయడానికి మరో కారణం కూడా ఉన్నది. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. మరో నాలుగున్నర ఏండ్లలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. పీసీసీ చీఫ్ పదవీ కాలం మూడేండ్ల్లు ఉంటుంది.
ఈ పదవీ కాలం, ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసుకున్న కాలం కలిపితే అటు ఇటుగా నాలుగేండ్లు గడిచిపోయినట్టే. ఆ తర్వాత ఎన్నికలకు మిగిలేది ఏడాది మాత్రమే. ఎన్నికలకు ఏడాది ముందు పీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
లాబీయింగ్‌ల ద్వారా ఆ ఏడాదిపాటు పీసీసీ పదవిని కాపాడుకుంటే, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తన అధ్యక్షతన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని సదరు మంత్రి లెక్కలు వేసుకుంటున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి అధికారం ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవిని కూడా కాదనుకొని పీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
రేవంత్‌రెడ్డి పీటముడి?
జూలై 7వ తేదీతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదవీ కాలం ముగియనున్నది. కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై ఆయన పీటముడి పెడుతున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతున్నది. కొత్త అధ్యక్షుడి ఎంపిక తన చేతిలో లేదంటూనే, నూతన అధ్యక్షు డి ఎంపికను ఆలస్యం చేస్తున్నట్టు పార్టీలో చర్చించుకుంటున్నారు. అధ్యక్ష పదవి కోసం మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్‌గౌడ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పోటీపడుతున్నారు.
సీనియర్లు పీసీసీ పగ్గాలు చేపడితే, తనకు ఇబ్బంది తప్పదనే ఆలోచన రేవంత్‌రెడ్డి చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం దెబ్బతింటుందనే వాదనను ఆయన అధిష్ఠానం ముందు ఉంచినట్టు ప్రచారం జరుగుతున్నది. మరికొంతకాలం తానే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నట్టు తెలిసింది.కుదరని పక్షంలో అనుయాయులను అధ్యక్ష పీఠంపై కూర్చేబెట్టే ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

