టీవర్క్స్‌లో మరో అత్యాధునిక యంత్రం
సృజనాత్మక ఆవిష్కరణలకు నెలవుగా ఉన్న టీవర్క్స్ మరో అత్యాధునిక యంత్రాన్ని సమకూర్చుకున్నది. వసంత్ టూల్ క్రాఫ్ట్స్ సంస్థ దాదాపు రూ.2 కోట్ల విలువైన జండ్ ప్రెసిషన్ డిజిటల్ కట్టర్ యంత్రాన్ని టీవర్క్స్‌కు అందజేసింది.
- డిజిటల్ కట్టర్‌ను అందజేసిన వసంత టూల్ క్రాప్ట్స్ సంస్థ
- స్విట్జర్లాండ్ నుంచి కొనుగోలు
- విద్యార్థులు, ఆవిష్కర్తలకు ఉపయుక్తం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సృజనాత్మక ఆవిష్కరణలకు నెలవుగా ఉన్న టీవర్క్స్ మరో అత్యాధునిక యంత్రాన్ని సమకూర్చుకున్నది. వసంత్ టూల్ క్రాఫ్ట్స్ సంస్థ దాదాపు రూ.2 కోట్ల విలువైన జండ్ ప్రెసిషన్ డిజిటల్ కట్టర్ యంత్రాన్ని టీవర్క్స్‌కు అందజేసింది. స్విట్జర్లాండ్‌లో తయారైన ఈ యంత్రంతో కాగితం, ప్లాసిక్, పేపర్‌బోర్డులు, గ్లాస్ ఫైబర్, కార్బన్ ఫైబర్, అరామిడ్ ఫైబర్, ఎండీఎఫ్, కలప, ఆక్రిలిక్, ఏసీపీ తదితర 200 రకాలకుపైగా ఉత్పత్తులను కటింగ్ చేయవచ్చు. ఎంతో విలువైన ఈ యంత్రం సాధారణంగా పెద్ద కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని సాయంతో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, విద్యార్థులు, ఆవిష్కర్తలు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను రూపొందించేందుకు వీలవుతుందని టీవర్క్స్ ప్రతినిధి తెలిపారు.
ఉచితంగానే యంత్రాల వినియోగం
వినూత్న ఆలోచనలతో వచ్చేవారు పూర్తిస్థాయి ఉత్పత్తి నమూనాలతో తిరిగి వెళ్లేలా టీవర్క్స్‌లో అత్యాధునిక యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని ఉచితంగానే ఉపయోగించుకునేందుకు వీలుకల్పిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కటింగ్, లేజర్ కటింగ్, మిల్లింగ్, డ్రిల్లింగ్, పాటరీ, సిరామిక్, కార్పెంటరీ, 3డీ, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ఎలక్ట్రో మెకానికల్ టెస్టింగ్, పీసీబీల తయారీ, డిజైన్ ఇంజినీరింగ్ తదితర 200 రకాలకుపైగా యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. కోట్ల రూపాయల విలువచేసే పలు రకాల యంత్రాలను దేశ, విదేశాలను తెప్పించి వినియోగానికి సిద్ధంగా ఉంచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

