హైదరాబాద్: పద్మశాలీల ఐక్యతా జైత్రయాత్రకు మద్దతునిస్తున్నట్లు తెలంగాణ పద్మశాలీ అఫీషియల్స్ ప్రొఫెష్నల్స్ అసోసియేషన్ (టీ పోపా) పేర్కొంది. చేనేత రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్న పద్మశాలీలు, తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నవారంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది.
ప్రస్తుత సందర్భంలో పద్మశాలీల ఐక్యతా జైత్రయాత్ర జరగడం ఎంతో సంతోషకరమని టీ పోపా అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సామల సహదేవ్, సహాధ్యక్షుడు శిరందాస్ శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల ఐక్యతా జైత్రయాత్రతో పద్మశాలీలకు ఎన్నో విధాలుగా మేలు చేకూరడమే కాకుండా నాయకత్వ ఐక్యత విషయంలో స్పష్టత వస్తుందన్నారు. మచ్చ ప్రభాకర్ రావు నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన ఏకతా మహాయజ్ఞానికి పద్మశాలీలంతా మద్దతు తెలపాలని కోరారు.