Israel – Lebanon | యుద్ధం తరుణంలో శాంతి వైపు తొలి అడుగు..! ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం
Israel - Lebanon | దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలతో సమతమవుతున్న ఇజ్రాయెల్, లెబనాన్‌లో(Israel - Lebanon ) దేశాల్లో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది.
హైదరాబాద్ : దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలతో సమతమవుతున్న ఇజ్రాయెల్, లెబనాన్‌లో(Israel – Lebanon ) దేశాల్లో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. అమెరికా(America) మధ్య వర్తిత్వంతో ఈ రెండు దేశాల మధ్య అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఒక చరిత్రాత్మక ‘ఫ్రేమ్‌వర్క్ శాంతి ఒప్పందం’(Historic agreement) కుదిరింది. శాంతి ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపుల నిరాయుధీకరణ, లెబనాన్ సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించడం, రెండు దేశాల మధ్య శత్రుత్వాలకు ముగింపు పలకడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం
ఈ ఒప్పందం శాశ్వత శాంతి భద్రతల కోసం ఒక చట్రాన్ని ఏర్పాటు చేయడానికి నాంది పలుకుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ రెండు దేశాలు రెండూశాంతియుతంగా జీవిస్తూ తమ తమ దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని ఇరుదేశాల మధ్య ఇతర దేశాల జోక్యాన్ని నిలిపివేయాలని పేర్కొన్నాయి.
అలాగే ఇన్నాళ్లు నిర్బంధంలో ఉన్నవారి విడుదల, మృతదేహాల అవశేషాలను తిరిగి అప్పగించేందుకు కృషి చేస్తామని ఇరు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఇరు దేశాల ప్రజలు సురక్షితంగా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి, భవిష్యత్తులో రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు ఏర్పడటానికి ఇది తొలి అడుగు అని అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

