హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీఎయిమ్), నాస్కామ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే అకడమిక్ గ్రాండ్ చాలెంజ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం వెల్లడించారు.
సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులను స్వీకరిం చనున్నట్టు తెలిపారు. అకడమిక్ గ్రాండ్ చాలెంజ్‌కు ఎంపికైన విజేతలకు రూ.5 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పారు. నవంబర్ 18న విజేతలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలకు టీ-ఎయిమ్ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.