Suryapet | సూర్యాపేటలో రెండు బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెన్‌పహాడ్ మండలంలోని అనంతారం గ్రామ శివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Suryapet | పెన్ పహాడ్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెన్‌పహాడ్ మండలంలోని అనంతారం గ్రామ శివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. పెన్‌పహాడ్ మండలంలోని అన్నారం బ్రిడ్జి గ్రామానికి చెందిన మీసాల చిన్న పిచ్చయ్య, మీసాల లోకేశ్వరి దంపతులు. లోకేశ్వరి సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వరిస్తున్నది. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం లోకేశ్.. తన భర్తతో కలిసి బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరింది. ఇదే సమయంలో సూర్యాపేటకు చెందిన చింత లోకేశ్ అనంతారంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై బైకుపై తిరిగి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో వీరి బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్న పిచ్చయ్య, లోకేశ్వరి, చింత లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేటలో రెండు బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Pawan Kalyan | విడాకులకు రెండు వారాల ముందే హింట్ ఇచ్చిన అన్నా కొణిదెల.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ వెనుక అసలు కారణం ఇదేనా?
IND vs NZ | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం..!
Ramayana OTT | ఓటీటీలో ‘రామాయణ’ రెండు వెర్షన్లు వస్తాయా ..సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
Samantha | సమంత బేబీ బంప్ ఫోటో వైరల్.. ఇదే నా మెటర్నిటి షూట్ అంటూ క్రేజీ క్యాప్షన్.. !
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

