ధాన్యం మాయంలో దోచిందెంత?
రైస్ మిల్లర్ల మాయాజాలానికి సీఎంఆర్ ధాన్యం మాయమైన విషయంలో కొత్త కోణం వెలుగు చూస్తున్నది.
- పతాకస్థాయికి సీఎంఆర్ అక్రమాలు
- మాయమైంది 800 కోట్లు… లెక్క తీసింది 477 కోట్లు
సూర్యాపేట, అక్టోబర్ 28 (సూర్యాపేట): రైస్ మిల్లర్ల మాయాజాలానికి సీఎంఆర్ ధాన్యం మాయమైన విషయంలో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. మిల్లర్లు దోచింది ఎంత..? అధికారులు దొబ్బింది ఎంత అనేది పరిశీలిస్తే ఆశ్చర్యానికి గురయ్యే విషయాలు వెలుగుచూస్తున్నవి. ఇటీవల సీఎంఆర్ ధాన్యంపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్‌తోపాటు స్థానిక అధికారులు నానా హంగామా చేసి జిల్లాలో రూ.77 కోట్ల ధాన్యం మాయమైనట్టు లెక్కలు తీశారు.
వాస్తవానికి ఈ ధాన్యం విలువ రూ.800 కోట్లుకు పైనే ఉంటుందని తెలిసింది. ఓ మిల్లుపై వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ రీసర్వే చేయించడంతో అక్రమాలు బయటపడి డీటీసీఎస్ను సరెండర్ చేశారు. రూ. 20 కోట్ల వరకు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తుండగా ఇందులో ఎవరి పాత్ర ఎంత అని అంతర్గత విచారణ చేయిస్తున్నట్టు తెలిసింది. కొద్ది నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ ధాన్యం తీసుకున్న మిల్లులపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్‌తో పాటు స్థానిక అధికారులు దాడులుచేసి, కేసులు నమోదు చేస్తున్నారు. ఆయా టీముల్లో ఉన్న కొంతమంది అధికారులు అక్రమాలకు తెరలేపారు. ఖమ్మం జిల్లాలో అక్రమాలకు పాల్పడిన అధికారులను విధుల నుంచి తొలగించగా.. సూర్యాపేట జిల్లాలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెన్‌పహాడ్ మండలం వెంకటసాయి మిల్లులో రూ.20 కోట్ల విలువ చేసే 2లక్షల బస్తాల ధాన్యం తక్కువ ఉన్నట్లు రికార్డు చేశారు. దీనిపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ రీ సర్వేకు ఆదేశాలు జారీచేయడంతో రూ.45 కోట్ల విలువ చేసే 4.25 లక్షల బ్యాగులు షార్టేజీ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో రెండు రోజుల క్రితం డీటీసీఎస్ను హెడ్డాఫీస్‌కు సరెండర్ చేయగా.. టెక్నికల్ అసిస్టెంట్‌ను తొలగించినట్టు సివిల్‌సైప్లె అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రూ.65 లక్షలు చేతులు మారినట్టు తెలిసింది. ఇప్పటివరకు 21 మిల్లులో రూ.477 కోట్ల విలువచేసే ధాన్యం మాయమైనట్టు గుర్తించి, కేసులు నమోదుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

