హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డుపై స్టేను తొలగించాలని కోరుతూ కర్ణాటక సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ నవంబర్4వ తేదీకి వాయిదా పడింది. వాస్తవంగా ఈ పిటిషన్‌పై ప్రత్యేకంగా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, సెప్టెంబర్ నుంచి చేపడుతామని జూలైలో సుప్రీంకోర్టు ప్రకటించింది.