చిన్న తరహా పరిశ్రమలకు చేయూత

- సీడీపీ కింద జిల్లాకో పారిశ్రామిక క్లస్టర్
- ఒక్కొక్క క్లస్టర్ అభివృద్ధికి 10 కోట్లు
- ఇప్పటికే రాష్ట్రంలో క్లస్టర్ల 9 ఏర్పాటు
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఐఐసీ) జిల్లాకు ఒక క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నది. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పుతున్నది. ఒక్కొక్క క్లస్టర్‌కు రూ.10 కోట్లు వెచ్చించి రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్తు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటు పూర్తయ్యింది. మిగిలిన జిల్లాల్లో ప్రతిపాదనల దశలో ఉన్నాయి.
ఒకే రకమైన ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తిచేసే కుటీర, చిన్న, మాధ్యమిక పరిశ్రమలను ఒకేచోట సమూహంగా ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో సీడీపీ పథకాన్ని అమలుచేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, నాణ్యత, మార్కెటింగ్ మొదలైన సమస్యలను పరిష్కరించడం ద్వారాఎంఎస్ఎంఈలకు స్థిరత్వం, వృద్ధికి తోడ్పాటును అందించాలన్నది పథకం లక్ష్యం. అన్నింటికీ కామన్‌గా మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూడాలన్నది దీని ముఖ్యోద్దేశం. కొత్తగా ఏర్పాటయ్యే క్లస్టర్లే కాకుండా ఇప్పటికే కొనసాగుతున్న వాటిల్లో కూడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఒకేచోట, ఒకేవిధమైన యూనిట్లను నెలకొల్పడం వల్ల ఉత్పత్తి సామర్థ్యంతోపాటు పోటీతత్వాన్ని పెంపొందించేందుకు వీలు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన క్లస్టర్లు
రంగారెడ్డి జిల్లాలో హయత్‌నగర్, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని క్లస్టర్లను అప్‌గ్రేడ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని కుందనపల్లి, ఖమ్మంలోని బుగ్గపాడు, జనగామలోని కల్లెం, సంగారెడ్డిలోని సుల్తాన్పూర్, సిద్దిపేటలోని పదనపల్లె, మెదక్‌లోని తూప్రాన్, మల్కాజిగిరిలోని రావల్‌కోల్‌లో క్లస్టర్లను ఏర్పాటుచేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా క్లస్టర్ల ఏర్పాటునకు టీఎస్ఐఐసీ ప్రతిపాదనలు సిద్ధంచేసింది.
చిన్న పరిశ్రమలకు మేలు
చిన్నచిన్న యూనిట్లు నెలకొల్పోవారికి ఈ క్లస్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నందున ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు కూడా సులభంగా పొందవచ్చు. ఔత్సాహికులు నేరుగా టీఎస్ఐఐసీని సంప్రదించి, అభివృద్ధి చేస్తున్న క్లస్టర్లలో ప్లాట్ల లభ్యతనుబట్టి చిన్నతరహా యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
-జయేశ్‌రంజన్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CDP
- industries
- jayesh ranjan
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

