రైతన్నల బలవన్మరణం
ర్షాభావ పరిస్థితులకు తోడు అప్పుల భారం పెరగడంతో మనస్తాపం చెంది ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నల్లగొండ, జనగామ జిల్లా ల్లో చోటుచేసుకున్నాయి.
- ఓ వైపు వర్షాభావ పరిస్థితి.. మరోవైపు అప్పుల భారం
- ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య
చందంపేట/పాలకుర్తి, జూలై 12 : వర్షాభావ పరిస్థితులకు తోడు అప్పుల భారం పెరగడంతో మనస్తాపం చెంది ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నల్లగొండ, జనగామ జిల్లా ల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామానికి చెందిన సభావట్ రమేశ్ (30) తనకున్న ఎకరంతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో పత్తి పంటను కాపాడుకోవడం కష్టంగా మారింది.
ఐదు బోర్లు వేసినా నీరు అడుగంటడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వ్యవసాయం కోసం చేసిన రూ.5 లక్షల అప్పులు తీర్చే మార్గం కన్పించక బుధవారం తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొన్నాడు. పక్క పొలం రైతులు గమనించి రమేశ్‌ను వెంటనే చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా, గురువారం రాత్రి మృతిచెందాడు. రమేశ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు.
జనగామ జిల్లాలో కౌలు రైతు..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య (55)కు సొంతంగా భూమి లేకపోవడంతో కొంత వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. కూతురి పెండ్లితోపాటు వ్యవసాయ పెట్టుబడి కోసం సుమారు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగ్గా పండక, అప్పులు తీర్చే మార్గం కానరాక తీవ్రమనస్తాపానికి గురైన లక్ష్మయ్య ఈ నెల 9న ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హనుమకొండలో ప్రైవేటు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతడి కుమారుడు రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయిప్రసన్నకుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

