Summer Holidays | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు( Schools ) ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు( Summer Holidays ) ప్రకటించింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
అయితే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు SA – II ఎగ్జామ్స్ ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఆరు నుంచి ఎనిమిది తరగతులకు 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మ. 12:30 గంటల వరకు SA – II ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇక 21 నుంచి 24వ తేదీ వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. 25వ తేదీన పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థుల మార్కులను తల్లిదండ్రులకు తెలిపి, వేసవి సెలవులు ప్రకటించనున్నారు.