గజ్వేల్, ఆగస్టు 25: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ కోర్సు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి చెందిన పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం మూసేసి నిరసన వ్యక్తంచేశారు.
హార్టికల్చర్ కోర్సుకు సంబంధించి మూడు రోజుల్లో నిర్వహించనున్న కౌన్సెలింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరో విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ కోర్సును ప్రవేశపెట్టడంతో తమ భవిష్యత్‌పై ప్రభావంపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎస్సై రఘుపతి విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.