ప్లేస్మెంట్స్కే తొలి ప్రాధాన్యం
ఒకప్పుడు విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలంటే అది ఏ యూనివర్సిటీలో ఉన్నది? ఆ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ ఎంత? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్స్‌ను పట్టించుకోవడం లేదు. 51% మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. 77%మంది విద్యార్థులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకొని కాలేజీలను ఎంపిక చేసుకొంటున్నారు. క్యాంపస్ వాతావరణం, వసతులు, ఫీజులు, స్కాలర్షిప్లు తదితర అంశాల గురించి ఆలోచిస్తున్నారు
- ఆర్థిక పరిస్థితిని బట్టి కాలేజీల ఎంపిక
- ఫీజులు, స్కాలర్షిప్లదీ కీలక పాత్రే
- విద్యార్థుల అభిరుచులపై ఐసీ-3 సర్వే
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలంటే అది ఏ యూనివర్సిటీలో ఉన్నది? ఆ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ ఎంత? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్స్‌ను పట్టించుకోవడం లేదు. 51% మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. 77%మంది విద్యార్థులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకొని కాలేజీలను ఎంపిక చేసుకొంటున్నారు. క్యాంపస్ వాతావరణం, వసతులు, ఫీజులు, స్కాలర్షిప్లు తదితర అంశాల గురించి ఆలోచిస్తున్నారు. అమెరికాకు చెందిన ఐసీ 3 ఇన్స్టిట్యూట్ 75 దేశాల్లోని 110 యూనివర్సిటీల్లో నిర్వహించిన సర్వేలో ఇదే అంశం వెల్లడైంది. ఈ సర్వేలో హైదరాబాద్ విద్యార్థులు సైతం పాల్గొనడం విశేషం. ప్రపంచంలో నేటికీ అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలే అంతర్జాతీయ అధ్యయన వేదికలుగా కొనసాగుతున్నాయని సర్వే తెలిపింది. నేటితరం విద్యార్థులు ఎక్కువగా డాటా సైన్స్, అనలిటిక్స్ అండ్ హ్యూమానిటీస్ ప్రోగ్రామ్‌లపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నది.
49%మందికి లక్ష్యమే లేదు
ప్రపంచంలో 49% మంది విద్యార్థులకు ఎటువంటి లక్ష్యమూ లేదని సర్వేలో తేలింది. నేటికీ 49% మంది ఏ కాలేజీలో చేరాలి? ఏ కోర్సు చదవాలి? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? అనే విషయాల గురించి కనీస సమాచారం ఉండటం లేదని, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లు తమకు అందుబాటులో లేవని తెలిపారు. అందుకే ఎటువంటి భవిష్యత్తు ప్రణాళిక లేకుండానే తమకు తోచిన సబ్జెక్టును ఎంపిక చేసుకొన్నామని పేర్కొన్నారు. కౌన్సెలర్లను నియమించుకొన్న 92% మంది తమకు వారి సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. 59% మంది విద్యార్థులు సరైన మార్గంలో నడవడానికి కౌన్సెలర్ల మార్గనిర్దేశనం కీలకపాత్ర పోషించిందని తెలిపారు. యువతరం ఒక లక్ష్యం లేకుండా కెరీర్‌ను ఎంచుకోవడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలేజీలు, కోర్సుల ఎంపికలో విద్యార్థుల ప్రాథమ్యాలు ఇలా
ప్లేస్‌మెంట్స్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నవారు – 51 %
కోర్సుల ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకొంటున్నవారు – 51%
వసతులు, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నవారు – 38%
ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నవారు – 45%
తమ ఆర్థిక పరిస్థితిని బట్టి కాలేజీలను ఎంచుకొంటన్నవారు – 77%

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

