నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణలో నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల నిరోధానికి పోలీసు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. నకిలీ విత్తనాల నిరోధంపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో మంత్రి సమీక్షించారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు, వ్యవసాయ శాఖలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ దాడులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఇంకా అక్కడక్కడ నకిలీ విత్తనాలు బయట పడుతున్నాయన్నారు. రాష్ర్టాన్ని నకిలీ విత్తనరహితంగా తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. విత్తన కంపెనీల లైసెన్స్ సరళతరం చేసే అవకాశం ఉందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.దేశంలో నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్ట్ పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 3,468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 320 మందిపై 209 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

