హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో స్టైపెండ్ చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులు సోమవారం నుంచి విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. తాజాగా శనివారం విద్యార్థులకు నెలకు రూ.19,000 చెల్లించేందుకు మల్లారెడ్డి మహిళా మెడికల్ కళాశాల యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కళాశాల యాజమాన్యం తెలిపినట్టు మెడికోలు వెల్లడించారు. విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు ఆధారంగా ైస్టెపెండ్ చెల్లిస్తుందని చెప్పినట్టు విద్యార్థులు పేర్కొన్నారు.