తెలంగాణ భగ్గుమన్నది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ పేరిట వేధించడంపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసనలు చేపట్టింది. పదేండ్ల పాటు రాష్ర్టాన్ని ప్రగతి బాటలో నిలిపిన ఉద్యమనేతను రేవంత్సర్కార్ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడింది. మండల కేంద్రాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టింది. సీఎం దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తంచేసింది. ఊరూరా ‘జై తెలంగాణ.. జై కేసీఆర్..రేవంత్ డౌన్ డౌన్’ నినాదాలతో హోరెత్తించింది. నిరసనలో భాగంగా నల్ల జెండాలు చేతబట్టి ప్రభుత్వ తీరు మార్చుకోవాలని హెచ్చరించింది.
హైదరాబాద్‌లోని తెలంగాణభవన్ వద్ద రేవంత్ దిష్టిబొమ్మకు పేగులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ నేత భూమేశ్‌పై కాంగ్రెస్ నేత భరత్ దాడి చేయడంతో చొక్కా చిరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిట్ నోటీసులను తగులబెట్టారు.

పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను పోలీసులు లాక్కొని తీసుకెళ్లారు. సీఎం ఇలాకాలోని మద్దూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ నిరసనలతో గులాబీమయంగా మారింది. ఆర్మూర్‌లో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని పోలీసులు తోసేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు.

ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులో రాస్తారోకో చేస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను అడ్డుకుంటున్న పోలీసులు

వనపర్తి జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన నిరసనలో నినాదాలు చేస్తున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు ఉరివేస్తున్న పార్టీ నాయకులు

వరంగల్ జిల్లా రాయపర్తిలోని జాతీయ రహదారిపై శ్రేణులతో కలిసి బైఠాయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి

ఆదిలాబాద్ జిల్లాలోని హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి-44పై సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు

మహబూబాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కార్యకర్తలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో నల్లజెండాలు చేతబట్టి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, నాయకులు

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర పటాన్ని దహనం చేస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ శ్రేణులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో ధర్నా నిర్వహిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నాయకులు

కేసీఆర్‌పై సిట్ విచారణను నిరసిస్తూ నాగర్‌కర్నూల్‌లో శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ తీస్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆందోళన చేస్తున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను అడ్డుకుంటున్న పోలీసులు

ఆసిఫాబాద్‌లో నల్లజెండాలతో ర్యాలీ తీస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

సంగారెడ్డిలోని చౌరస్తాలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న నాయకులు

మహబూబాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు

తెలంగాణభవన్ ఎదుట ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, శ్రేణులు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బైక్ ర్యాలీ తీస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ తీస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, నాయకులు

ఆర్మూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల తోపులాటలో స్పృహ తప్పి పడిపోయిన మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

రాష్ట్రం సాధించిన కేసీఆర్‌పై కక్ష సాధింపా..?ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ నోటీసుల పేరిట వేధించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర సచివాలయం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న పార్టీ మైనారిటీ నేత మసిఉల్లాఖాన్,తదితరులు

నిర్మల్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నాయకులు

సిద్దిపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు

జనగామలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్ ఎదుట నిరసన వ్యక్తంచేస్తున్న ఎమ్మెల్యే
మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్, రాజారాం యాదవ్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ తీస్తున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ శ్రేణులు

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి

హనుమకొండలో బైక్ ర్యాలీ తీస్తున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం, బీఆర్ఎస్ శ్రేణులు