హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం సోమవారం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ విస్తృత స్థాయి సమావేశం తర్వాత బీసీల రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. బీసీ కులసంఘాల అధ్యక్షులు, మహిళా, విద్యార్థి, యువజన సంఘాల బాధ్యులు సమావేశాన్ని విజయవంతం చేయాలని జాజుల విజ్ఞప్తి చేశారు.