తెలుగు రాష్ర్టాల్లో తొలిసారి ‘వెలిస్ రోబోటిక్’ టెక్నాలజీ
మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో స్టార్ హాస్పిటల్ కొత్త ఒరవడికి శ్రీకా రం చుట్టింది. హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘వెలిస్ రోబోటిక్' యంత్రాన్ని గురువారం స్టార్ హాస్పిటల్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డా క్టర్ నీలం వీ రమణారెడ్డి ప్రారంభించారు.
- మోకాలి మార్పిడి చికిత్సలో స్టార్ హాస్పిటల్ కొత్త ఒరవడి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో స్టార్ హాస్పిటల్ కొత్త ఒరవడికి శ్రీకా రం చుట్టింది. హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘వెలిస్ రోబోటిక్’ యంత్రాన్ని గురువారం స్టార్ హాస్పిటల్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డా క్టర్ నీలం వీరమణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో 3 నెలల క్రితం ఆవిష్కరించిన ‘వెలిస్ రోబోటిక్’ యంత్రం 2 వారాల క్రితం మన దేశంలో అందుబాటులోకి వచ్చిందని, తెలు గు రాష్ర్టాల్లో తొలిసారి స్టార్ హాస్పిటల్లోనే ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. ఇతర రోబోటిక్ యంత్రా ల ద్వారా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయాలంటే సీటీ-స్కాన్, ఎంఆర్ఐ లాంటివి అవసరమవుతాయని, అదే ‘వెలిస్ రోబోటిక్’ టెక్నాలజీని వినియోగించినప్పుడు సీటీ-స్కాన్, ఎంఆర్ఐ అవసరం ఉండదని వివరించారు.
ఇతర రోబోటిక్ల కంటే ‘వెలిస్ రోబోటిక్’ చికిత్స చాలా కచ్చితంగా, సహజంగా ఉంటుందన్నారు. ఇతర రోబోటిక్ శస్త్రచికిత్సల్లో కండరాల తొలగింపు అధికంగా, వెలిస్ రోబోటిక్ శస్త్రచికిత్సలో నామమాత్రంగా ఉంటుందని చెప్పారు. దీని వల్ల నొప్పి తక్కువగా ఉండటంతోపాటు రోగి త్వరగా కోలుకుంటాడని, శస్త్రచికిత్స తరువాత ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

