TG Tenth Results | వీడిన ఉత్కంఠ.. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల
TG Tenth Results | తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు.
TG Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పది పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాలను ntnews.com వెబ్సైట్లో చూసుకోవచ్చు.
ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

