Sri Rama navami | మరికాసేపట్లో కల్యాణ మండపానికి శ్రీసీతారాములు
సీతారామ కల్యాణ (Sri Seetha Rama Kalyanam) మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో వధూవరులైన సీతారాములు కల్యాణ మండపానికి వేంచేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా లక్ష్మణ సమేత శ్రీసీతారాములు కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణానికి (Mithila stadium) రానున్నారు.
భద్రాచలం: సీతారామ కల్యాణ (Sri Seetha Rama Kalyanam) మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో వధూవరులైన సీతారాములు కల్యాణ మండపానికి వేంచేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా లక్ష్మణ సమేత శ్రీసీతారాములు కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణానికి (Mithila stadium) రానున్నారు. మిథిలా ప్రాంగణంలో 10:30 గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభిస్తారు. సరిగ్గా మధ్యా హ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న (Abhijit lagnam) సుమూహూర్తాన కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నా రు. శుక్రవారం మిథిలా ప్రాంగణంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది.
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచలంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు దేశం నలుమూలలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాద్రికి చేరుకుంటున్నారు. వేదిక అయిన మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలకరించారు. కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు.
కల్యాణ మహోత్సవం జరిగిన మర్నాడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా శుక్రవారం పన్నెండేండ్లకు ఒకసారి నిర్వహించే పుష్కర మహాపట్టాభిషేకం జరుగనున్నది. సీతారామ కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ రూ.కోటి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఆలయ అధికారులు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 6 వేల మంది సిబ్బందితో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

