హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని పలు రివర్ బోర్డులు, సంస్థల విధులపై సిబ్బందికి మంగళవారం ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ర్టాల సాగునీటి శాఖ అధికారులకు కేంద్ర జలశక్తి శాఖ సోమవారం లేఖ రాసింది. బోర్డుల పని తీరును మెరుగుపరిచేందుకు, విధి విధానాలపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నది.