విద్యాసంస్థల్లో అమ్మాయిల రక్షణకు ప్రత్యేక చట్టం : సీపీ సీవీ ఆనంద్
CP CV Anand | తెలంగాణ ప్రభుత్వం త్వరలో విద్యాసంస్థల్లో అమ్మాయిల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురానుందని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. ఓయూ ఠాగూర్ స్టేడియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సు జరిగింది. కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్,
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో విద్యాసంస్థల్లో అమ్మాయిల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురానుందని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. ఓయూ ఠాగూర్ స్టేడియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సు జరిగింది. కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్, ఓయూ వీసీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిలపై అఘాయిత్యాల నివారణకు ప్రత్యేక చట్టం తేనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. డీవీఏ స్కూల్లో జరిగిన ఘటన తర్వాత చట్టంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే స్కూల్స్, కాలేజీల్లో చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యాంటీ డ్రగ్స్ కమిటీల మాదిరిగానే ఈ చట్టం పని చేస్తుందన్నారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగిస్తున్న వారి సంఖ్య 11కోట్లుగా ఉందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు సైతం మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. దశాబ్ద క్రితం ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కళాశాలల్లో కమిటీలు వేశామని, కమిటీలతో ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం మాదక ద్రవ్యాలను నిరోధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీల్లో విద్యార్థులను చేర్చాలన్నారు. గోవా డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, గోవాలో ఉండి హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

