Pocharam Srinivas reddy | హరితహారంతో రాష్ట్రంలో 33 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం: స్పీకర్ పోచారం
ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas reddy) అన్నారు. చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
బాన్సువాడ: ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas reddy) అన్నారు. చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు సంభవిస్తాయని హెచ్చరించారు. దేశంలో ప్రతి మనిషికి సగటున కేవలం మూడు చెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాతావరణం సమతుల్యత బాగా ఉండాలంటే భూ విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో (Koti Vruksharchana) భాగంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి 2016లో ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించుకోగా దానిని అధిగమించి ఇప్పటి వరకు 270 కోట్ల మొక్కలు నాటారని చెప్పారు.
2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అడవుల విస్తీర్ణం 26 శాతం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కృషి, హరితహారం కార్యక్రమంతో ఇప్పుడు 33 శాతానికి పెరిగిందని తెలిపారు. చెట్లు ఉంటే వర్షాలు పడతాయని వెల్లడించారు. చెట్లను నాటడం, సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. ఒక్కరోజు కోటి మొక్కలు నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

