ప్రజల బతుకులు మారాలి : స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
Speaker Pocharam | ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు
Speaker Pocharam | ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టి ఉన్నంత వరకు మహాత్ముడు అందరికీ గుర్తుటారన్నారు. శాంతి, సామరస్యంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు.
అంతటి మహానీయుడు హత్యకు గురికావడం దేశానికి దురదృష్టకరమన్నారు. వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టాలన్నారు. దేశం సంపన్నమైందని, దేశంలో ప్రకృతి వనరులకు మానవ వనరులను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలన్న ఆయన.. సీఎం కేసీఆర్ పాలన గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు.
ప్రస్తుతం బతుకుదెరువు కోసం పట్నాలకు వెళ్లిన వారంతా తిరిగి పల్లెలకు చేరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రివర్స్ వలసలు మొదలయ్యాయని, గ్రామాల్లో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. నేడు గ్రామాలు ఎంతో బాగున్నాయన్న స్పీకర్.. తన 47 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు. తాగునీరు, కరెంటు తదితర సమస్యలు లేవని, కేంద్రం కొన్ని అంశాలలో వ్యతిరేకించినా తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు.
కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల్లో 20కి 19 తెలంగాణ పల్లెలే ఎంపికయ్యారన్నారు. దేశంలో రూ.2,78,000 తలసరి ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మహాత్మాగాంధీ గారి ఆలోచనలు అమలులో ఉండి స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని, అందుకు మనమందరం పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లెజిస్లేటివ్ సెక్రెటరీ వీ నరసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

