Southwest Monsoon | రాష్ట్రంలోకి మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. మోస్తరు వర్షాలు
Southwest Monsoon | రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు పదిరోజుల్లో ప్రవేశించనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య రాష్ర్టాన్ని తాకే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నది.
Southwest Monsoon | హైదరాబాద్, మే 31 (నమస్తేతెలంగాణ):రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు పదిరోజుల్లో ప్రవేశించనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య రాష్ర్టాన్ని తాకే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నది. వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు వెల్లడించింది.
వచ్చే నాలుగు రోజులు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు. కాగా నిరుటితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.4 డిగ్రీలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో నిప్పుల కుంపటిగా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా వాతావరణం సాయంత్రం మారింది. ఆదిలాబాద్ జిల్లా రైతులు మార్కెట్ యార్డులో పోసిన జొన్నలు తడిసి ముద్దయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

