అంబర్‌పేట, ఏప్రిల్ 8: కాంగ్రెస్‌లో చేరతానని తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ఆ పార్టీ మైండ్ గేమ్ అని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. సోమవారం బాగ్‌అంబర్‌పేటలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ తనను ఎమ్మెల్యేను చేసిందని, సీఎం కేసీఆర్ చలవతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయ ని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంబర్‌పేట నియోజకవర్గంలో పార్టీ బూత్‌స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు ఎన్నికలపై అవగాహన, దిశానిర్దేశం చేయనున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి పద్మారావుగౌడ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.