హైదరాబాద్‌లో 400 ఉద్యోగాలిస్తాం
హైదరాబాద్‌లోని సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్ (సాప్) సర్వీసెస్‌లో కొత్తగా 400 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించినట్టు ఎన్టీటీ డాటా బిజినెస్ సొల్యూషన్స్ ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్‌పాండే చెప్పారు
- ఆదిలాబాద్‌లో ఇప్పటికే 100 మందికి
- తెలంగాణలో కార్యకాలాపాల విస్తరణ
- ఎన్టీటీ డాటా బిజినెస్ సొల్యూషన్స్
- ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్‌పాండే వెల్లడి
హైదరాబాద్, మార్చి 10 : హైదరాబాద్‌లోని సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్ (సాప్) సర్వీసెస్‌లో కొత్తగా 400 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించినట్టు ఎన్టీటీ డాటా బిజినెస్ సొల్యూషన్స్ ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్‌పాండే చెప్పారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎన్టీటీ డాటా సంస్థలో 3000 మంది పనిచేస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న అవసరాలతో ఈ ఏడాది 600 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టు తెలిపారు. ఇందులో 400 ఉద్యోగాలను ఒక్క హైదరాబాద్‌లోనే భర్తీ చేస్తామని, బెంగళూరు, చెన్నై, నోయిడా, ముంబై నగరాల్లో 200 పోస్టులు నింపుతామని వివరించారు. హైదరాబాద్‌లో 2013 నుంచి తమ సంస్థ ఉన్నదని, ఇక్కడ సుమారు 2000 మంది, మిగిలిన నగరాల్లో వెయ్యి మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సంస్థ కార్యకాలాపాలను మరింతగా విస్తరించనున్నట్టు చెప్పారు.లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు గ్రామీణ ప్రాంత యువత ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సంజీవ్ దేశ్‌పాండే చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీడీఎల్టీ ల్యాబ్స్ అనే స్టార్టప్ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఆ సంస్థ తమ తరఫున కొత్తవారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఆదిలాబాద్‌కు చెందిన 100 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

