స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోండి
దివ్యాంగులను కించపర్చేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు డీజీపీ జితేందర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
- ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలి
- దివ్యాంగులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్
- డీజీపీకి వీహెచ్పీఎస్ నేతల వినతి
- జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : దివ్యాంగులను కించపర్చేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు డీజీపీ జితేందర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వీహెచ్పీఎస్ చైర్మన్ అందె రాంబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య మాట్లాడుతూ ‘దివ్యాంగులు విమానాలు నడపగలరా? శస్త్ర చికిత్సలు సరైన పద్ధతిలో చేయగలరా? తగు సామర్థ్యాలు లేని వారిని ఆల్ ఇండియా సర్వీసుల్లోకి ఎలా తీసుకుంటారు’ అని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధపెట్టాయని తెలిపారు. అవమానించేలా మాట్లాడిన ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడడమంటే నిబంధనలు ఉల్లంఘించటం కాదా? అని నిలదీశారు. ఆమెపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోర్ కమిటీ చైర్మన్ ఎల్ గోపాలరావు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండన
స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను వెంటనే వెనకి తీసుకొని, దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో డిమాండ్‌చేశారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రతిభ అనేది ఎవరి సొత్తుకాదు. వైకల్యాలు, శక్తి సామర్థ్యాలు మేధోశక్తిపై ప్రభావం చూపవు. ఓ ఐఏఎస్ అధికారి దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగజారుస్తున్నది. బ్రెయిలీ లిపిని అందించిన లూయీస్ బ్రెయిలీ మొదలు అనేక మంది సివిల్ సర్వెంట్లు, రాజకీయవేత్తలు, డాక్టర్లు వారి రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను చాటుతూ ఉన్నతస్థాయి సేవలందిస్తున్న వాస్తవం మనకండ్లముందున్నది’ అని పేర్కొన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన
స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకటేశ్, అడివయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన తెలిపారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్ అవరసం లేదని ప్రకటించడం ఆమె అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. కేంద్ర సర్వీస్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని కోర్టు తీర్పులున్నాయనే విషయం తెలియకుండా ఐఏఎస్ ఎలా అయ్యారని ప్రశ్నించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ఎస్ఎఫ్ఐ నాయకులు మమత, వెంకటేశ్, ఎం.శోభన్, రమేశ్, జగదీశ్, గంగమ్మ, రాజు, పవన్, నర్సింగ్, శంకర్‌గౌడ్, శ్రీను, రఘు పాల్గొన్నారు.
ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
స్మిత సబర్వాల్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. దేశంలోని కోట్లాదిమంది దివ్యాంగుల మనోభావాలను, భారత రాజ్యాంగం వారికి కల్పించిన హకులను భంగపరిచేలా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

