SKOTCH Award: ‘మిషన్ కాకతీయ’కు స్కోచ్ అవార్డు
SKOTCH Award : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ ...

(SKOTCH Award) హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ నుంచి బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అవార్డును దక్కించుకున్నది. తాజాగా మరో జాతీయ అవార్డును అందుకున్నది.
తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ-గవర్నెన్స్ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డ్‌కు ఎంపికయింది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్ 75వ సమ్మిట్‌లో ఈ-గవర్నెన్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామాంజనేయులు ఈ అవార్డును అందుకున్నారు. మిషన్ కాకతీయకు అవార్డు దక్కడంపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ చీఫ్ ఇంజినీర్ అనిల్‌కుమార్, ఈఈ రామాచారి నేతృత్వంలో తయారుచేశారు.
చెరువుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఎల్‌ఏఎంఎం పేరిట సాఫ్ట్వేర్, మొబైల్ యాప్‌ను తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ రూపొందించింది. వీటి ద్వారా చెరువుల స్థితిగతులను, నీటి నిల్వ, పునరుద్ధరణ పనుల ప్రగతి తదితర సమచారాన్ని ఆన్లైన్ ద్వారానే తెలుసుకోవడంతోపాటు మానిటరింగ్ చేసే వీలున్నది. తద్వారా వరద నివారణ చర్యలను సమర్థంగా నిర్వహించడంతో పాటు సమయం, నిధులను ఆదా చేసే అవకాశం ఉన్నది.
ఇవి కూడా చదవండి..
నాన్నకు ప్రేమతో.. ఆ కూతురు ఏం చేసిందంటే..?
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
షుగర్‌ను ఇలా అదుపులో పెట్టుకోవాలి..! ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

