Valmidi temple | వల్మిడిలో 50 కోట్లతో సీతారామచంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణం.. నేడు ప్రారంభోత్సవం
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడిలో రూ.50 కోట్లతో పునర్నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సోమవారం పునఃప్రారంభించనున్నారు.
- హాజరుకానున్న మంత్రులు
Valmidi temple | పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 3 : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడిలో రూ.50 కోట్లతో పునర్నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సోమవారం పునఃప్రారంభించనున్నారు.
ఆలయ ప్రారంభోత్సవంతోపాటు విగ్రహాల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామితోపాటు మంత్రులు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్ హాజరుకానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
వల్మిడి సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభం, విగ్రహాల పున: ప్రతిష్టాపన కార్యక్రమ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అలాగే మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా సోమవారం త్రిదండి చినజీయర్ స్వామి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌లు హాజరవుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. రూ.50కోట్లతో నిర్మించిన వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభం, విగ్రహాల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందన్నారు. పాలకుర్తిలో రూ.10కోట్లతో తలపెట్టిన పాల్కురికి సోమనాథుడి మెమోరియల్ స్టాచ్యూ, సోమనాథుడి కల్యాణ మండపం, రూ.2కోట్లతో తలపెట్టిన మిషన్ భగీరథ కార్యాలయం, రూ.25కోట్లతో తలపెట్టిన హరిత కాకతీయ హోటల్ పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి వివరించారు. అలాగే వల్మిడిలో రూ.150కోట్లతో మంజూరు చేసిన పలు రోడ్లు, రూ.2కోట్లతో మంజూరు చేసిన బ్రిడ్జిని మంత్రులు ప్రారంభిస్తారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
మూడో రోజూ వైభవంగా ఉత్సవాలు..
వల్మిడి ఆలయ ప్రారంభోత్సవంతో పాటు సీతారామచంద్ర స్వామి విగ్రహాల పునః ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం మూడో రోజు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ పూజలను సన్నూరు ఆలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల రంగాచార్యస్వామి పర్యవేక్షణలో అర్చకులు ఘనంగా జరిపారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి ధ్వజస్తంభానికి నీళ్లు పోశారు. ఉషా దయాకర్‌రావుతో పాటు కలెక్టర్ శివలింగయ్య దంపతులు, ఆలయ కాంట్రాక్టర్ కొడూరు నర్సింహారెడ్డి-సునీత, డీపీవో రంగాచారి-పద్మ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
రాములోరి గుడికి రారండోయ్..
వల్మిడి రాములోరి గుడి ప్రారంభోత్సవానికి వేళయింది. ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మూడు రోజుల నుంచే ఆలయ ప్రాంగణం సహా చుట్టుపక్కలంతా పండుగ వాతావరణం నెలకొనగా నేడు కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. రూ.50కోట్లతో రూపుదిద్దుకున్న వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం, విగ్రహాల పునః ప్రతిష్ఠాపన, పాలకుర్తిలో రూ.10కోట్ల నిర్మించిన సోమనాథుడి విగ్రహం, కల్యాణమండపం, రూ.2కోట్లతో కట్టిన మిషన్ భగీరథ కార్యాలయం, రూ.25కోట్లతో హరిత కాకతీయ హోటల్‌కు శంకుస్థాపనతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ హాజరుకానున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తికాగా భక్తులు వేలాదిగా తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎర్రబెల్లి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

