హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ డీజీ శిఖాగోయెల్ నేతృత్వంలోని సిట్ బృందం తొలిసారి సమీక్ష నిర్వహించింది. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిన అంశంపై డీజీ శిఖాగోయెల్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ కేసులను పర్యవేక్షిస్తున్న దర్యాప్తు అధికారులను హైదరాబాద్లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సమావేశానికి పిలవాలని నిర్ణయించారు. కేసు ఫైళ్లు, సంబంధిత సమాచారాన్ని సూచించిన ఫార్మాట్లో తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత వివిధ శాఖల అధికారులు, ఏజెన్సీలతో మీటింగ్ నిర్వహించనున్నారు.