పాలన చేతకాకుంటే తప్పుకోండి
రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన మూడేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావు పెట్టి.. నీళ్లియ్యకుండా రైతులను దగా చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలని, అదీకూడా చేతగాకపోతే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
- 15 రోజుల్లో ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లిచ్చి చూపిస్తం
- మూడేండ్లలో ‘పాలమూరు’ను పడావు పెట్టిన్రు
- మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లకు నీళ్లిచ్చే సోయిలేదు
- సర్కార్‌పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్
- కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరంతో కలిసి పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనుల పరిశీలన
కొల్లాపూర్, అక్టోబర్ 22 : రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన మూడేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావు పెట్టి.. నీళ్లియ్యకుండా రైతులను దగా చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలని, అదీకూడా చేతగాకపోతే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తాము నీటిని ఎత్తిపోసి 15 రోజుల్లో ఏదుల రిజర్వాయర్‌కు జలాలు పారిస్తామని సవాల్ విసిరారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని లిఫ్ట్-1లో ఉన్న మూడో ప్యాకేజీ మెయిన్ కెనాల్, రెండో ప్యాకేజీలోని రిజర్వాయర్, స్లూయిస్‌లను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్ఎల్ఐ పనుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఒక పంప్ ద్వారా 4 టీఎంసీలను నిల్వ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఒత్తిడితో మొన్న రెండు పంపులను ఆన్ చేసినా నార్లాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపలేదని మండిపడ్డారు. ఈ రిజర్వాయర్ నిండేందుకు ఇంకా వారం, పదిరోజుల సమయం పడుతుందని తెలిపారు. పీఆర్ఎల్ఐలో ఇన్నాళ్లూ పనులు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. ప్రభుత్వం పీఆర్ఎల్ఐలో ఉన్న కొద్దిపాటి పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లలో 5 టీఎంసీల చొప్పున నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉండేదని చెప్పారు.
సవాల్‌కు ప్రతి సవాల్
‘మేము ఏమీ తొడలు కొట్టం, జబ్బలు చరచం.. మీ ప్రభుత్వానికి చేతకాదని చెప్తే.. మిగిలిన పనులకు ఎస్టిమేట్ చేసి జీవో ఇస్తే అంతే వాల్యూకు నామినేషన్ పద్ధతిన మేమే నిలబడి పనులు చేయిస్తం. 15 రోజుల్లో పనులు పూర్తిచేసి ఏదుల రిజర్వాయర్ వరకు నీళ్లు తీసుకొస్తం’ అని నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ఐదు రిజర్వాయర్లు నిర్మాణం చేసి 70 టీఎంసీలను నిల్వ చేసే విధంగా ప్రాజెక్టును సిద్ధం చేస్తే.. కాంగ్రెస్ సర్కార్ మూడేండ్లలో మూడు కట్టలను తొలగించలేని స్థితిలో ఉన్నదని విమర్శించారు. జూరాల నుంచి 245 టీఎంసీల నీళ్లు శ్రీశైలం జలాశయంలోకి వెళ్తే ఆంధ్రావాళ్లు 100 టీఎంసీలకుపైగా తరలించుకుపోయారని తెలిపారు.
ఇప్పటికీ శ్రీశైలంలో 60 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని, ఇందులో ఏడాది మొత్తం మిషన్ భగీరథకు 9 టీఎంసీలు సరిపోతాయని, మిగిలిన నీటిలో 30 శాతం ఆవిరి కావడం జరుగుతుందని తెలిపారు. అందుకే పీఆర్ఎల్, ఎంజీకేఎల్ఐ మోటర్లను నిరంతరాయంగా నడుపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అల్టిమేటమ్‌తో మంత్రి జూపల్లి కృష్ణారావు పీఆర్ఎల్ఐ పంపింగ్ ప్రారంభించారని తెలిపారు. ‘నీళ్లు ఎలా తీసుకొని వెళ్తారో.. వచ్చి తీసుకొని వెళ్లండి’ అని ఈ జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మంత్రి జూపల్లి సవాల్ విసిరాడని, అందుకే జూపల్లి సవాల్‌ను స్వీకరించి పనుల వద్దకు వచ్చినట్టు నిరంజన్‌రెడ్డి తెలిపారు. నీళ్లకు జంప్ చేయడం తెలియదని, గ్రావిటీ ద్వారా వెళ్తాయని అన్నారు. వెటకారం మాటలు ఆపి రైతులకు నీళ్లు ఎట్లా ఇవ్వాలో ఆలోచించాలని మంత్రి జూపల్లికి హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

