బకాయిలు తక్షణమే చెల్లించాలి.. విద్యుత్తు సౌధ ఎదుట సింగరేణి కార్మికుల భారీ ధర్నా
జెన్కో, ట్రాన్స్‌కోకు బొగ్గు సరఫరాను అడ్డుకుంటాం.. కార్మికులకు బోనస్ ప్రకటనలో తీవ్ర అన్యాయం
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సింగరేణి బకాయిలు రూ.59 వేల కోట్లకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) మండిపడింది. సింగరేణి బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ‘చలో హైదరాబాద్’ పేరిట హైదరాబాద్‌లోని విద్యుత్తుసౌధ వద్ద భారీ ధర్నా నిర్వహించింది. బకాయిలను విడుదల చేయకపోతే జెన్కో, ట్రాన్స్‌కోకు బొగ్గు సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది. అవసరమైతే బొగ్గు బావుల వద్దే ఆందోళనకు దిగి ఉత్పత్తిని స్తంభింపజేస్తామని స్పష్టం చేసింది.
సింగరేణిలోని 12 ఏరియాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, భద్రతా పరికరాలు కొనుగోలు చేయడానికి కూడా నిధుల కొరత ఎదురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కార్మికులకు చెల్లించాల్సిన బోనస్లపైనా ప్రభావం పడుతున్నదని పేరొన్నారు.
కార్మికులకు బోనస్‌లో అన్యాయం
సింగరేణి కార్మికులకు ఈ ఏడాది ఒక శాతం కూడా అదనపు బోనస్ ఇవ్వకపోవడం దుర్మార్గమని సీతారామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. లాభాల పంపిణీ, బోనస్ ప్రకటనలో తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధుల బృందం జెన్కో ఫైనాన్స్ డైరెక్టర్ వీర మహేందర్‌కు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

