దేశమంతా తెలంగాణ అభివృద్ధి
తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ప్రయోగంగా మారాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో, పాలనలో కీలకభూమిక పోషించాలని సింగపూర్ ఎన్నారైలు ఆకాంక్షించారు. దేశంలో అనేక నగరాలు ఇంకా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. హైదరాబాద్ నగరం ఎనిమిదేండ్లలోనే అద్భుత అభివృద్ధిని సాధించి రోల్ మాడల్‌గా నిలిచిందని
- జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం
- సింగపూర్ ఎన్నారైల ఆకాంక్ష
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ప్రయోగంగా మారాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో, పాలనలో కీలకభూమిక పోషించాలని సింగపూర్ ఎన్నారైలు ఆకాంక్షించారు. దేశంలో అనేక నగరాలు ఇంకా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. హైదరాబాద్ నగరం ఎనిమిదేండ్లలోనే అద్భుత అభివృద్ధిని సాధించి రోల్ మాడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఏం జరిగిందో తెలియాలంటే దేశంలో వివిధ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రముఖులు ఈ నగరాన్ని సందర్శించాలని సూచించారు. హైదరాబాద్ తరహా అభివృద్ధి దేశమంతా జరగాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, తామంతా అండగా ఉంటామని చెప్పారు.
భారత్‌కు తెలంగాణ దిక్సూచి
తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి కావాలి. దేశంలోని మహానగరాల్లో ఉండే ఉద్యోగులకు, మేధావులకు, రాజకీయ నాయకులకు హైదరాబాద్ నగర అభివృద్ధిని చూపించాలి. హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడేలా తయారైంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో, పాలనలో కీలక పాత్రపోషించాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే మేము అండగా ఉంటాం.
– రఘురాం సరాబు, సాఫ్ట్వేర్ ఇంజినీర్, సింగపూర్
దేశంలో అన్ని నగరాలు హైదరాబాద్‌లా కావాలంటే

దేశంలోని మిగతా నగరాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. దేశంలో అత్యంత వెనుకబడిన తెలంగాణను కేసీఆర్ కేవలం ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశం పాఠాలు నేర్చుకునేలా చేశారు. కేసీఆర్ లాంటి రాజకీయ వ్యూహచతురత, పాలనా పట్టు ప్రస్తుతం దేశంలో మరే జాతీయ నాయకుడికి లేదు. దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఎన్నారైల మద్దతు తప్పకుండా ఉంటుంది.
– భాస్కర్ గుప్తా నల్ల, సాఫ్ట్వేర్ ఇంజినీర్, సింగపూర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

