Peddapalli | మహాశివరాత్రి ఉత్సవాలు.. ముస్తాబైన కాకతీయుల కాలం నాటి శైవాలయాలు
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
ధర్మారం, ఫిబ్రవరి 25: పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు. మండలంలో నంది మేడారం గ్రామంలో శ్రీ అమరేశ్వర స్వామి, ఖిలా వనపర్తి గ్రామంలో శ్రీ శివాలయం, రచ్చపల్లి గ్రామంలో శ్రీ సాంబమూర్తి ఆలయాలు కాకతీయుల రాజుల పాలనలో నిర్మితమయ్యాయి. ప్రతి ఏటా ఇట్టి ఆలయాలలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భక్తుల దర్శనం కోసం ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు.
ఆయా మండపాలలో శివపార్వతుల కళ్యాణం కోసం ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేయించారు. నంది మేడారంలోని శ్రీ అమరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గర్భగుడిలోని శివుడికి అభిషేకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మణిశర్మ తెలిపారు. అదేవిధంగా రచ్చపల్లిలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ తరహాలో భక్తులు కోడిమొక్కుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఇక్కడ గత రెండు రోజుల నుంచి స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహిస్తుండగా బుధవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి రథోత్సవం జరపడానికి వారు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయా గ్రామాలలో ని శివాలయాలలో జరిగే బుధవారం నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులకు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

