హనుమకొండ జడ్పీ చైర్మన్‌కు అవమానం
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ అవమానానికి గురయ్యారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
- మాట్లాడుతుండగా మైకు లాక్కున్న మంత్రి పొన్నం ప్రభాకర్
- భీమదేవరపల్లి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఘటన
భీమదేవరపల్లి, జూన్ 23: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ అవమానానికి గురయ్యారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 239 ఉన్న ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లను 1000కి పెంచినట్టుగా తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పేరిట అప్పటి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం కింద దళిత, గిరిజనులకు ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో రాజకీయాలు మాట్లాడొద్దంటూ సుధీర్‌కుమార్ చేతిలో నుంచి మైకును లాక్కున్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు జడ్పీ చైర్మన్ పలుమార్లు మైక్ అడిగినా ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

