SCR Awards | దక్షిణ మధ్య రైల్వేకు అవార్డుల పంట
SCR Awards | దక్షిణ మధ్య రైల్వే (SCR) కు అవార్డుల పంట పండింది. విద్యుత్ పొదుపు అంశాల్లో ఏడు నేషనల్ ఎనర్జి కన్జర్వేషన్ అవార్డులు అందుకున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు.
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే (SCR) కు అవార్డుల పంట పండింది. విద్యుత్ పొదుపు అంశాల్లో ఏడు నేషనల్ ఎనర్జి కన్జర్వేషన్ అవార్డులు అందుకున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ అవార్డులు 2023 సంవత్సరంలో చేసిన విద్యుత్ పొదుపు మేరకు దక్కాయన్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ దశలోనే ఇంధన పొదుపు అవార్డులను ప్రకటిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని వివరించారు.
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (పీఆర్ఎస్) ప్రథమ బహుమతి, విజయవాడలోని వ్యాగన్ డిపోకు ప్రథమ బహుమతి వచ్చిందని వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ద్వితీయ బహుమతి, లేఖా భవనానికి ద్వితీయ బహుమతి, రేటిగుంట, గుంతకల్ రన్నింగ్ రూంలకు మెరిట్ సర్టిఫికెట్లు, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌కు మెరిట్ సర్టిఫికెట్లు దక్కాయన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

