MLA Raja Singh | పత్తాలేని రాజాసింగ్.. లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పిగా సీనియర్ ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలనొప్పిగా తయారయ్యారు. కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలన్నింటికీ దూరంగా ఉంటున్నారు.
- పార్టీ కార్యకలాపాలకూ దూరంగా సీనియర్ ఎమ్మెల్యే
- హైదరాబాద్, జహీరాబాద్‌లో ప్రచారానికి ప్లాన్
- ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగినట్టు ప్రచారం
- ఎన్నికల వేళ మౌనం.. ఆందోళనలో అధిష్ఠానం
ML Raja Singh | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలనొప్పిగా తయారయ్యారు. కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలన్నింటికీ దూరంగా ఉంటున్నారు. ‘ఒకప్పుడు మేం పార్టీ నుంచి ఆయనను బహిష్కరించాం.. ఇప్పుడు ఆయన మా పార్టీని బహిష్కరించినట్టుగా కనిపిస్తున్నది’ అని నేతలు చెప్పుకొనే స్థాయిలో రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు.
శనివారం కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీలు, మోర్చాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులతో సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా హాజరయ్యారు. కానీ, రాజాసింగ్ డుమ్మా కొట్టారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ తిరుగుబాటు చేసినట్టేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆయనను ఎలా సముదాయించాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నది.
బీజేపీఎల్పీ పదవి ఇవ్వకపోవడంతో అలక
వాస్తవానికి రాజాసింగ్ డిసెంబర్ నుంచే పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత పదవి ఇవ్వాలని రాజాసింగ్ కోరినా పార్టీ పెద్దలు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. డిసెంబర్లో జరిగిన ఓ సమావేశంలో మధ్యలోనే అలిగి వెళ్లిపోయి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. రాజాసింగ్ నోటి దురుసుతో అసెంబ్లీలో ఏదైనా మాట్లాడితే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎల్పీ నేత పదవి ఇవ్వలేదని ప్రచారం జరిగింది.
ఈ పరిణామాలతో ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లాలని రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జహీరాబాద్ లేదా హైదరాబాద్ టికెట్ ఆశించారని తెలిసింది. ఇక్కడా ఎదురుదెబ్బ తగలడంతో పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ టికెట్‌ను మాధవీలతకు కేటాయించిన సమయంలో ‘హైదరాబాద్‌లో పోటీ చేయించడానికి మొగోడే దొరుకలేదా?’ అంటూ పరుష పదజాలంతో వ్యాఖ్యానించారు. అయినా బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రెండు నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్లాన్
లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో రాజాసింగ్‌ను వాడుకోవాలని బీజేపీ భావించింది. హైదరాబాద్ పరిధిలోని హిందూ ఓటర్లను, జహీరాబాద్‌లో మహారాష్ట్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రాజాసింగ్‌తో ప్రచారం చేయిస్తే కలిసి వస్తుందని భావించింది. కానీ రాజాసింగ్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

