సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి(86) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీహరి మంగళవారం ఉదయం ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీహరి భార్య గతేడాది నవంబర్‌లో మరణించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత వారం శ్రీహరి ఇంట్లోనే పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. దీంతో నిమ్స్‌లో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కన్నుమూశారు. గుడిపూడి శ్రీహరి మరణం పట్ల పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
గుడిపూడి శ్రీహరి 1968లో ది హిందూ కంట్రిబ్యూటర్‌గా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈనాడులో, హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలోనూ పని చేశారు. ఇక తెలుగు సినిమా చిత్రాల సమీక్షకు శ్రీహరి ఓ చిరునామాగా నిలిచారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించడంతో పాటు తన తోటి సీనియర్ జర్నలిస్టులతో కలిసి, బషీర్‌బాగ్‌లోని జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్మాణానికి సేవలందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

