MLC Kavitha | మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | మహిళలకు స్వావలంభన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, మహిళా సంఘాలకు రూ. 15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | హైదరాబాద్ : మహిళలకు స్వావలంభన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, మహిళా సంఘాలకు రూ. 15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు రూ. 16.5 లక్షల మేర రుణమాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలకు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మహిళలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
బుధవారం నాడు తెలంగాణ మహిళా సాధికారత సమాఖ్య సంఘం సభ్యులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కేసీఆర్ హయాంలో ఎప్పుడూ తాము అబద్దం చెప్పలేదని, మహిళా సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామనే చెప్పామని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ. 20 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు అబద్దాలు చెబుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూ. 5 లక్షల మేర వడ్డీ లేని రుణాలు ఇస్తున్నదని, కానీ అబద్దాలు చెప్పి మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
రాష్ట్రాలు ఏ చిన్న పని చేసినా కేంద్ర ప్రభుత్వం తమ భాగస్వామ్యం కూడా ఉందని చెప్పుకుంటుందని, ప్రతీ చిన్న పనికి నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం మహిళలకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసి లూటీ చేసే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు రూ. 16.5 లక్షల మేర రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని, కానీ మహిళలకు మాత్రం రుణాలు ఇవ్వడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మనసు రాకపోవడం శోచనీయమని అన్నారు. నిజంగా మహిళల అభివృద్ధి పట్ల చిత్తశుద్ది ఉంటే మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రకటించాలని సూచించారు.
మహిళల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాసు ధరను రూ. 50 పెంచి గుదిబండను మోపిందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతుంటే ఇక్కడ పెంచడమేంటని నిలదీశారు. ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తే ప్రధాని మోదీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అని బీజేపీ నాయకులు అంటున్నారని, ఇలా ఇష్టమున్నట్లు ధరలు పెంచితే మోదీ ఎంత గొప్ప వ్యక్తి మాకేంటి అని అన్నారు. ఈ కార్యక్రమలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రూప్ సింగ్ , జాగృతి నాయకులు మర్రిపల్లి మాధవి మరియు పెద్దయెత్తున మహిళలు పాల్గొన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

