సచివాలయ క్యాంటీన్ నిర్వహణ అస్తవ్యస్తం
సచివాలయంలో క్యాంటీన్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందంటూ కాంట్రాక్ట్ ఏజెన్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- ఉద్యోగుల అసంతృప్తి.. పలు ఫిర్యాదులు
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో క్యాంటీన్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందంటూ కాంట్రాక్ట్ ఏజెన్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యాంటీన్లో టిఫిన్, భోజనం నాణ్యత, సబ్సిడీ అమలు, నిర్వహణలో జవాబుదారీతనం కొరవడిందని ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుత కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించి, ఉద్యోగుల సహకార సొసైటీ ఆధ్వర్యంలోనే క్యాంటీన్ నిర్వహణ చేపట్టాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.
ఈ డిమాండ్ మేరకు క్యాంటీన్ నిర్వహణలో మార్పులకు అనుగుణంగా సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎన్నికలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో నవంబర్ 5న సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించి సహకారశాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ నోటీసు జారీ చేశారు. నవంబర్ 10లోపు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని సూచించారు. అభ్యంతరాల పరిశీలన, ఓటర్ల తుదిజాబితా ధ్రువీకరణ అనంతరం తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

