ఆడియో పార్ట్-2 ఎమ్మెల్యేల కోనుగోలుపై బీజేపీ బేరసారాలు
BJP Conspiracy | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం బీజేపీ పన్నిన కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం బీజేపీ పన్నిన కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో రామచంద్రభారతి మాట్లాడిన ఆడియో వెల్లడికాగా, ఇప్పుడు మరో ఆడియో లీక్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 27 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజి అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణలు ఉన్నాయి.
ఆ ఆడియోలోని సమాచారం ప్రకారం.. పైలట్ రోహిత్‌రెడ్డి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చించుకున్నారు. పైలట్‌కు ఒక రేటు, వెంట వచ్చేవారికి మరోరేటు ఇవ్వాలని, మునుగోడు పోలింగ్‌లోపు చేరితే వంద కోట్లు ఇవ్వాలని మాట్లాడుకున్నారు. రాష్ట్ర నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు అంత ప్రాధాన్యం లేదని, ఈ అంశాలను నేరుగా సెంట్రల్ డీల్ చేస్తుందని చెప్పుకున్నారు. గుజరాత్ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నామని చర్చించుకున్నారు.
ఒక్కసారి ఎంట్రీ అయితే అన్ని అమిత్ షానే చూసుకుంటారని, రోహిత్ వెంట ముగ్గురు వచ్చేందుకు రెడీగా ఉన్నారని, చేవెళ్ల, కొడంగల్, పరిగి ఎమ్మెల్యేలనూ టచ్ చేశామని, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుందని వారు డిస్కస్ చేశారు. ముందుగా నలుగురు, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఈ సందర్భంగా నందు హామీ ఇచ్చాడు. అయితే ఆ ఆడియోలో ఎవరెవరు ఏం మాట్లాడారో మీరే స్వయంగా వినండి..
Read More : ఆడియో-1 ..ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో రామచంద్రభారతి బేరసారాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

