Alert | ఈ నెల 25 నుంచి జూలై 3 వరకు 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
హైదరాబాద్: ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. వీటిలో కొన్నిటిని ఒక్కోరోజు, మరికొన్ని అన్ని రోజులు రద్దుచేసినట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను జూన్ 25, 26 తేదీల్లో, కాచిగూడ నుంచి రాయచూర్, మహబూబ్‌నగర్ వెళ్లే రైళ్లను జూన్ 26 (సోమవారం)న రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఇక కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూరు టౌన్ మధ్య నడిచే రైళ్లను జూన్ 26 నుంచి జూలై 3 వరకు, కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసెంజర్ రైళ్లను ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు హైదరాబాద్-లింగంపల్లి-చందానగర్-ఫలక్‌నుమా-రామచంద్రాపురం మధ్య తిరిగే ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆ 36 రైళ్లు ఇవే..
కాజీపేట-డోర్నకల్ డోర్నకల్-కాజీపేట, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, భద్రాచలం- విజయవాడ- భద్రాచలం, సికింద్రాబాద్-వికారాబాద్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, సిర్పూర్ టౌన్-కరీంనగర్-సిర్పూర్ టౌన్, కరీంనగర్-నిజామాబాద్-కరీంనగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, బళ్లార్షా-కాజీపేట-బళ్లార్ష, భద్రాచలం-బళ్లార్ష, సిర్పూర్ టౌన్- భద్రాచలం, కాచిగూడ-మహబూబ్‌నగర్-కాచిగూడ, కాచిగూడ-రాయచూరు, రాయచూర్- గద్వాల-రాయచూర్, రాయచూర్-కాచిగూడ, సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ రైళ్లు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

