వెండర్ల ఖాతాల్లోకి స్కూళ్ల నిధులు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- టీచర్లను అవమానిస్తున్న కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ ఖర్చులకు సంబంధించిన నిధులను నేరుగా పాఠశాల హెచ్ఎం లేదా సీనియర్ సిబ్బంది ఖాతాల్లో జమ చేసేవారని, ఇప్పుడు ఆ నిధులను వెండర్ల ఖాతాల్లో జమ చేస్తుండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
సాధారణంగా స్కూళ్లలో నిర్వహించే కార్యక్రమాలు, మరమ్మతులతోపాటు స్టేషనరీ లాంటి అవసరాలకు అయ్యే ఖర్చులను ముందుగా టీచర్లలో ఎవరో ఒకరు చెల్లించి, ఆ తర్వాత బిల్లు పెట్టుకునేవారని, దీంతో అధికారులు ఆ డబ్బులను నేరుగా ఆ టీచర్ ఖాతాలో జమ చేసేవారని తెలిపారు. ఇప్పుడు స్కూళ్ల అవసరాల కోసం చిన్నచిన్న కొనుగోళ్లు చేసినప్పటికీ జీఎస్టీతో కూడిన బిల్లులు తీసుకురావాలంటూ షరతులు పెడుతున్నారని, ఆ బిల్లులు కూడా సకాలంలో రావడం లేదని చెప్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

