కోతుల భయంతో చెరువులో దూకి..
కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం& అడవిమామిడిపల్లికి చెందిన దీపక్ డిగ్రీ చదువుతున్నాడు
- ఇద్దరు బాలురు మృతి, మరో ఇద్దరిని కాపాడిన యువకుడు
మాక్లూర్, సెప్టెంబర్ 3 : కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం& అడవిమామిడిపల్లికి చెందిన దీపక్ డిగ్రీ చదువుతున్నాడు. ఇతను బొల్లి రాజేశ్ (12) అతని తమ్ముడు హన్మాండ్లు, అఖిలేశ్(12), అభిలాశ్తో గ్రామశివారులోని ఊరచెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు.
ఆ సమయంలో కోతులు గుంపులుగా రావడంతో భయంతో ఆ ఐదుగురు చెరువులోకి దూకారు. ఈత రాక మునిగిపోతున్న హన్మాండ్లు, అభిలాశ్‌ను దీపక్ ఒడ్డుకు చేర్చాడు. అనంతరం చెరువులో మునిగిపోయిన రాజేశ్, అఖిలేశ్‌ను దీపక్ అతికష్టం మీద ఒడ్డుకు చేర్చగా, రాజేశ్ అప్పటికే మృత్యువాతపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అఖిలేశ్‌ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించగా, అప్పటికే చని పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాజేశ్, అఖిలేశ్ డిచ్పల్లిలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు కారణంగా వారు ఇంటికొచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

