సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహిస్తాం : మంత్రి గంగుల
కరీంనగర్ : బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం ప్రకటనను స్వాగతిస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో.. కరీంనగర్ తెలంగాణ చౌకు వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సబ్బండ వర్ణాల సంక్షేమానికి పోరాడిన సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత 30 సంవత్సరాలుగా బహుజనులు పోరాడుతున్నారు. కానీ, సమైక్య పాలనలో పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు నాటి పాలకులకు మనసు రాలేదని విమర్శించారు.
కానీ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

