గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన లాతూర్ వృక్ష ఫౌండేషన్ అభినందించిన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్
మహారాష్ట్రలోని లాతూర్ నగరాన్ని పచ్చని తోటలా మార్చేందుకు 2,690కిపైగా రోజులుగా నిరంతరం శ్రమిస్తున్న ‘ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్' మరో కీలక ముందడుగు వేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా దూసుకుపోతున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో ఈ సంస్థ అధికారికంగా చేరింది. తీవ్ర నీటి ఎద్దడితో ఒకప్పుడు రైళ్ల ద్వారా తాగునీరు తెచ్చుకున్న దుస్థితి నుంచి లాతూర్ నగరం నేడు పచ్చని నందనవనంగా రూపుదిద్దుకుంటున్నది.
డాక్టర్ పవన్ లడ్డా నేతృత్వంలోని వైద్యులు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, అధికారులతో కూడిన ‘ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్’ వేలాది మొకలు నాటి లాతూర్ నగర రూపురేఖలనే మార్చేసింది. ఈ ఫౌండేషన్ తాజాగా దేశవ్యాప్త హరిత ఉద్యమమైన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగస్వామి అయింది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ నాయకత్వంలో, సహ వ్యవస్థాపకులు రాఘవ్ మార్గదర్శకత్వంలో ప్రారంభమైన ఈ సరికొత్త ప్రయాణానికి బుధవారం మహారాష్ట్ర కోఆర్డినేటర్ సుధీర్ బిందు ఫౌండేషన్ సభ్యులకు జమ్మి మొకను బహూకరించి స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న ఫౌండేషన్ సభ్యులకు సంతోష్‌కుమార్ అభినందనలు తెలుపగా, రాబోయే రోజుల్లో లాతూర్ పరిసర ప్రాంతాల్లో మరింత భారీ ఎత్తున మొకలు నాటి సంపూర్ణ హరితమయంగా తీర్చిదిద్దుతామని డాక్టర్ పవన్ లడ్డా ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

